బిజెపితో జనసేన దోస్తి

bjp & janasena
bjp & janasena

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతయ జనతాపార్టీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాయి. జనసేనతో కలిసి నడవడంపై బిజెపి ముఖ్యనేతలు గురువారం విజయవాడలో భేటీ కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణతో పాటు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునిల్‌ దేవ్‌ ధర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పాటు మరికొందరు ముఖ్యనేతలు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ నాయకుల సూచనల మేరకు ఏఏ అంశాలలో కలిసి వెళ్లాలనే దానిపై ఇరు పార్టీల నేతులు చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. కాగా అమరావతి రాజధాని కొనసాగింపు అంశమే తొలి పోరాట అజెండా కానుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/