ఒడిశాలో రైలు ప్రమాదం

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌

Lokmanya Tilak Express Derails In Cuttack
Lokmanya Tilak Express Derails In Cuttack

కటక్‌: ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్‌్‌ప్రెస్‌ కటక్‌ సమీపంలోని నిర్గుండి వద్ద వెనక నుంచి గూడ్స్‌ రైలును ఢీకొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 12 భోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కటక్‌లోని ఆస్ప్రత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/