బింబిసార ట్రైలర్ ను విడుదల చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బింబిసార ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న తాజా చిత్రం బింబిసార. ఆగస్టు 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసారు. బింబిసారుడి ప్రపంచం నుంచి మరో గొప్ప దర్శనం. ఆగస్ట్ 5న పెద్ద స్క్రీన్ అనుభవం మీ కోసం ఎదురుచూస్తోంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. త్రిగర్తలాధినేత బింబిసారుడితో పాటు కల్యాణ్ రామ్ పోషించిన మరో పాత్రని కూడా పరిచయం చేశారు.

హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు, ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం..’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ‘నాడైనా, నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి’ అని చెప్పే డైలాగ్‌ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే బింబిసారుడిగా కల్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ జూలై 29న జరగబోతోంది. దీనికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

YouTube video