బైక్ కు రూ. 42,475 చలాన్.. నడి రోడ్ ఫై బైక్ ను వదిలి పారిపోయాడు

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు వాహనదారులకు చలాన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది చలాన్లు కొడుతుండగా..కొంతమంది మాత్రం చలాన్లు కట్టకుండా పోలీసులకు దొరకకుండా తిరుగుతుంటారు. తాజాగా ఆలా పోలీసులకు కంటపడకుండా గత కొంతకాలంగా తిరుగుతున్న ఓ వ్యక్తి బైక్ ను పోలీసులు ఆపారు. ఆ తర్వాత ఆ బైక్ కు ఉన్న చలాన్ లిస్ట్ చూసి షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన AP 23 M 9895 నెంబర్ గల హీరో హోండా ప్యాషన్ బైకును పోలీసులు ఆపారు. దాంతో వాహన యజమాని బైకును ఆపి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలా రోడ్ ఫై బైక్ ను వదిలివెళ్లడం తో పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత బైకుకు చలానా విధించారు. చలానా లిస్ట్ చూస్తే ఆ బైకు మీద అప్పటికే 179 చలానాలు ఉన్నాయి. వాటి మొత్తం అక్షరాల రూ. 42,475. ఈ జరిమానాలను చెల్లించకుండా వాహన యజమాని తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం పోలీసులకు చిక్కడంతో.. బైకును సీజ్ చేశారు.