ఈటెల జామున కామెంట్స్ కు మెదక్ జిల్లా కలెక్ట‌ర్ హ‌రీష్ కౌంట‌ర్

ఈటెల జామున కామెంట్స్ కు మెదక్ జిల్లా కలెక్ట‌ర్ హ‌రీష్ కౌంట‌ర్

జమున హేచరీస్‌ భూములపై కలెక్టర్‌ హరీశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడం..ఆ భూములన్నీ కబ్జా చేసిన భూములే అని కలెక్టర్‌ చెప్పడం పట్ల ఈటెల జామున ఫైర్ అయ్యారు. ‘కలెక్టర్‌ ఏమైనా రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్‌గా పనిచేస్తున్నారా..’ అంటూ జమున ప్రశ్నించారు. కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు..ఈ తరుణంలో జామున కామెంట్స్ కు కలెక్టర్ హరీష్ కౌంటర్ ఇచ్చారు.

ఈట‌ల జ‌మున చ‌ట్ట విరుద్ధం గా భూమి ని కొనుగోలు చేశార‌ని స‌ర్వే నంబ‌ర్ 130 లో అసలు ప‌ట్టా భూమి లేద‌ని అన్నారు. దీనిని క‌బ్జా చేశార‌ని అన్నారు. ఈటెల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైనవి అని అన్నారు. ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామ రావ్ దగ్గర నుండి కొనుగోలు చేశారని అన్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చట్ట విరుద్ధమ‌ని అన్నారు. అలాగే ఈ భూమి లో అక్ర‌మం గా పౌల్ట్రీ షేడ్ లు నిర్మించారని తెలిపారు. భూముల సర్వే సమయంలో కూడా జామున హేచరిస్ ప్రతినిధులు పంచనామా లో సంతకాలు చేశారని గుర్తు చేశారు. అలాగే సర్వే 81 లో కూడా భూమి లేని 7గురికి అసైన్డ్ చేయబడిందని అన్నారు.