70 ఏళ్ల వృద్ధుడిపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు దాడి..

70 ఏళ్ల వృద్ధుడిపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పెద్దాయన అనే జాలి కూడా లేకుండా రోడ్ ఫై ఆలా కొట్టడం ఏంటి అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ..సదరు మహిళా కానిస్టేబుళ్లఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని కైమూర్ లో సైకిల్ ఫై వెళ్తూ 70 ఏళ్ల వృద్ధుడు కిందపడిపోయాడు. ఆపై లేచి నిలబడడానికి కాస్త సమయం పట్టింది. అంతే ఆ సయమంలో ట్రాఫిక్ జాం కావడం తో నీ వల్లే ట్రాఫిక్ జాం అయ్యిందని సదరు వృద్ధుడిపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. దెబ్బలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా విడవకుండా విచక్షణారహితంగా కొట్టారు. పట్టపగలు రోడ్డు మీద జరుగుతున్న ఈ దారుణాన్ని ఆపేందుకు చుట్టూ ఉన్నవారు కూడా ప్రయత్నించలేదు. ఓ జర్నలిస్టు ఈ దారుణాన్ని వీడియో తీసి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ట్వీట్ చేశారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వృద్ధుడు ఎంత ఘోరమైన తప్పుచేసినా సరే ఇంతలా కొట్టకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సదరు మహిళా కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఈ వీడియోపై స్పందించారు. వీడియోను రీట్వీట్ చేస్తూ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని తేజస్వీ యాదవ్ ను కోరారు.