గణతంత్ర దినోత్సవ కానుకగా హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు టీజర్ మరో ఐదు రోజుల్లో రాబోతుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్బంగా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత రత్నం తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి నెలలు గడుస్తుంది. మధ్య కరోనా తో బ్రేక్ పడితే..ఆ తర్వాత పవన్ వేరే సినిమాల కారణంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో అభిమానులకు మెగా అప్డేట్ ఇచ్చారు నిర్మాత ఏ ఎం రత్నం. ఈ సినిమా తాలూకా టీజర్ ను గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న టీజర్ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నట్టు పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు. ఈ అప్డేట్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొఘల్‌ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.