హౌస్ లో ఉన్న ఆరుగురికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్..ఇలా నామినేట్ చేస్తారని ఊహించలేదు

హౌస్ లో ఉన్న ఆరుగురికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్..ఇలా నామినేట్ చేస్తారని ఊహించలేదు

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మరో రెండు వారాల్లో పూర్తి కాబోతుంది. ఈ తరుణంలో ఈ షో ఫై ఇంకాస్త క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉండగా..ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు..ఎవరు బిగ్ బాస్ హౌస్ ను విడిచివెళ్తారు..టైటిల్ ఎవరు దక్కించుకుంటారో అనే ఆసక్తి నెలకొనింది. నిన్న అఆదివారం ప్రియాంక సింగ్ ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఇక ఈరోజు సోమవారం నామినేషన్ పక్రియ ఉండడం తో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారని అంత ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో బిగ్ బాస్ లీక్ రాయుళ్లు ఈరోజు ఎపిసోడ్ తాలూకా నామినేషన్ పక్రియను బయటకు లీక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం.. 14వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ అంతా గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతుందట. మరీ ముఖ్యంగా నెంబర్ వన్ ర్యాంక్ కోసం కొందరు కంటెస్టెంట్లు గొడవ పడతారని తెలిసింది. ఫినాలేకు ముందు ఒక వారం మాత్రమే ఉండడంతో కంటెస్టెంట్లు తమ ర్యాంకులను ఎంచుకోవాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడట. ఇందులో ఎన్నో గొడవలు జరిగిన తర్వాత కంటెస్టెంట్లు తమ తమ స్థానాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.0 వీజే సన్నీ మొదటి స్థానంలో నిలవగా.. రెండో ర్యాంకులో షణ్ముఖ్ జస్వంత్ ఉన్నారట. ఇక, మూడో స్థానంలో ఆర్జే కాజల్, నాలుగో స్థానంలో శ్రీరామ చంద్ర, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి హన్మంత్ నిలిచారట. ఇక, టాస్క్ తర్వాత బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి షాకిచ్చాడట. టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామ చంద్ర తప్ప.. అంటే హౌస్‌లో ఉన్న మిగిలిన సభ్యులు మానస్, కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఈ వారం నామినేట్ అయ్యారని సమాచారం. ఈ నామినేషన్ తో అంత షాక్ లో పడ్డారని అంటున్నారు. మరి ఇది ఇలా సాగిందనేది ఈరోజు రాత్రి ప్రసారమై ఎపిసోడ్ లో తెలుస్తుంది.