అంబేద్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయం: చంద్రబాబు

అమరావతి: నేడు అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను ట్విటర్ వేదికగా స్మరించుకున్నారు. సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయమని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/