బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాడో లేదో తన కోరిక తీర్చుకున్న విశ్వ

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాడో లేదో తన కోరిక తీర్చుకున్న విశ్వ

బిగ్ బాస్ షో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు హౌస్ సభ్యుల జీవితాలను సైతం మార్చేస్తుంది. వారిని పాపులర్ చేయడమే కాదు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెడుతుంది. తాజాగా బిగ్ బాస్ 5 సీజన్ సైతం చాలామందిని పాపులర్ చేయడమే కాదు వారి కోరికలను సైతం తీర్చేస్తుంది. రీసెంట్ గా హౌస్ నుండి బయటకు వచ్చిన విశ్వ తన కోరిక ను తీర్చుకున్నాడు.

తాజాగా విశ్వ బీఎండబ్ల్యూ కారును కొనేశాడు. దీంతో ఇంత లగ్జరీ కారును కొనేయడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్ కారు కొన్నాడంటే.. ఏ రేంజ్‌లో బిగ్ బాస్ నుంచి రెమ్యూనరేషన్ వచ్చి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మనం కలలు కన్న కారును కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌లో ఉన్నా.. మా కుటుంబంలో కొత్త మెంబర్ వచ్చింది.. దీనంతటికి కారణం ఆ దేవుడు, బిగ్ బాస్ అంటూ విశ్వ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గరి నుండి తనదైన ఆటతో పాటు టాస్క్‌లో గట్టి పోటీ ఇచ్చాడు కానీ ఎక్కువగా సింపతీ కార్డు ఉపయోగించాడనే ముద్ర పడిపోవడం..బయట పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం తో త్వరగా ఇంట్లో నుండి బయటకు వచ్చాడు.