నెల్లూరులో వివాహేతర సంబంధం : రోడ్డుమీదనే డాక్టర్‌ను చితకొట్టిన మహిళ

ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు కామన్ అయ్యాయి. కట్టుకున్న భర్త , భార్య ఉండగానే వారిని కాదని సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ పచ్చటి సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వల్ల చాలామంది బిడ్డలు ఆనాధలు అవుతున్నారు. తాజాగా నెల్లూరు లో ఓ వివాహేతర సంబంధం రోడ్డెక్కింది.

వివరాల్లోకి వెళ్తే..

నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లపాటు ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచింది. ఐతే ఏం జరిగిందో ఏమో.. బాలకోటేశ్వరరావు.. ఆమె వద్దకు వెళ్లడం మానేశాడు. దీంతో ఆమె ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య
మాట మాట పెరిగి తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. దీంతో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/watch?v=3UJUoz_sEW4