పుష్ప టీం కు షాక్..రిలీజ్ వాయిదా పడనుందా..?

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుకుమార్ డైరెక్షన్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. బన్నీ కెరియర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా గా ఈ మూవీ పలు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో హిందీ రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. పుష్ప హిందీ వెర్షన్‌ కు సెన్సార్ నిరాకరించింది. దీంతో ‘పుష్ప’సినిమాకు సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి.

సెన్సార్ కోసం రాత్రింబవళ్ళు పని చేస్తుంది టెక్నికల్ టీమ్. ‘రా’ మెటీరియల్ తోనే తెలుగు సెన్సార్ పూర్తి చేశారు. కన్నడ వెర్షన్ సెన్సార్ కూడా రా మెటీరియల్ తోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే హిందీ వెర్షన్ కు సభ్యుల సెన్సార్ నిరాకరించింది. పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామని స్పష్టం చేసింది సెన్సార్ బోర్డు. దీంతో ‘పుష్ప’ కు బిగ్ షాక్ తగిలింది. దీంతో హిందీ వెర్షన్ డిసెంబర్ 17 న రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియడం లేదు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.