నయన్ దంపతులకు బిగ్ రిలీఫ్

నయన్ దంపతులకు బిగ్ రిలీఫ్ లభించింది. నయనతార , విఘ్నేష్ శివన్ దంపతులు స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ క‌వ‌ల పిల్ల‌ల‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ప్రకటించిన దగ్గరి నుండి సోషల్ మీడియా లో అంత దీనిగురించి మాట్లాడుకున్నారు. అయితే న‌య‌న‌తార స‌రోగ‌సి అంశంపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేస్తూ విచారణకు కమిటీ నియమించింది. ఈ క్రమంలో విచారణ మొదలుపెట్టిన కమిటీ..నయన్ దంపతులకు కలిగిన కవల పిల్లలు చట్టబద్ధంగానే జన్మించారని కమిటీ తేల్చి చెప్పింది. చట్టబద్ధంగానే సరోగసీ ద్వారా నయన్ దంపతులు పిల్లలను కన్నారని తమ నివేదికను కోర్ట్ కు సమర్పించింది.

ఈ నివేదికలో నయన్ పెళ్లి, సరోగసీ కోసం ఆ దంపతులు చేపట్టిన చర్యలను కమిటీ కూలంకషంగా ప్రస్తావించింది. 2016 మార్చి 11న విఘ్నేశ్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా కమిటీ తెలిపింది. ఈ క్రమంలో సరోగసీ కోసం నయన్ దంపతులు 2021 ఆగస్టులో ప్రక్రియను మొదలుపెట్టారని, ఇక నిబంధనల మేరకు అదే ఏడాది నవంబర్ లో వారు సరోగసీ కోసం ఒప్పందం కూడా చేసుకున్నారని వెల్లడించింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారని నివేదికలో తెలిపింది. ఈ నివేదిక బట్టి నయన్ దంపతులకు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయ్యింది.