హాస్పటల్ నుండి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఫస్ట్ పిక్

షూటింగ్ లో గాయపడి చికిత్స తీసుకుంటున్న బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఫస్ట్ పిక్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. బిచ్చగాడు మూవీ తో తెలుగు ఆడియన్స్ ను అలరించిన విజయ్..ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బిచ్చగాడు మూవీ లెవల్లో అలరించలేకపోయారు. ప్రస్తుతం బిచ్చగాడు మూవీ సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మలేసియా లో జరుగుతుంది. ఈ షూటింగ్ జరుగుతుండగా నాల్గు రోజుల క్రితం అయన ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి గురైన వెంటనే చిత్ర యూనిట్ హుటాహుటిన మలేషియాలోని ఓ హాస్పటల్ కు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత చెన్నైకి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు మీడియా లలో , సోషల్ మీడియా లో విజయ్ ఆరోగ్యం విషమంగా ఉందని ప్రచారం జరగడం తో అంత ఖంగారు పడుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో విజయ్.. హాస్పటల్ లోని పిక్ ను పోస్ట్ చేసి అభిమానులకు ఊపిరి పోశారు. ‘డియర్ ఫ్రెండ్స్. మలేసియాలో ‘పిచైకారన్-2 ’ (తెలుగులో బిచ్చగాడు-2) షూటింగ్‌లో దవడ, ముక్కుకి గాయాలయ్యాయి. ఈ గాయాల నుంచి కోలుకున్నాను. అలానే ఒక మేజర్ సర్జరీ కూడా పూర్తయ్యింది. వీలైనంత త్వరగా మీతో మాట్లాడతాను. నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించి, సహకరించినందుకు ధన్యవాదాలు’ అని విజయ్ ఆంటోని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో లవ్, దండం పెడుతున్న ఎమోజీతో ఒక ఫొటోని కూడా షేర్ చేశాడు.