మోడీ నో ఎంట్రీ.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు

మరోసారి కేంద్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో ప్లెక్సీ లు వెలిసాయి. మోడీ సర్కార్ తీరుపట్ల తెలంగాణ సర్కార్ ఆగ్రహం తో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా కేంద్రంలో మోడీని దించాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. అందుకే జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మోడీ వైఫల్యాలను బయటపెడుతూ వస్తున్నారు. తాజాగా రేపు మోడీ తెలంగాణ లో పర్యటించబోతున్నారు.

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసేందుకు రామగుండానికి రానున్నారు. ఈ క్రమంలో మోడీ కి రాకకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ప్లెక్సీలు వెలిసాయి. చేనేతపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్‌ ఫోర్స్‌ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.