చంద్రశేఖర్ తల్లి, భార్య, కుమార్తెలను పరామర్శించిన భువనేశ్వరి

Bhuvaneshwari condolences to Chandrasekhar mother, wife and daughters

హైదరాబాద్‌ః టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కృష్ణా జిల్లా కంచికచర్లకు తరలించారు. నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కంచికచర్లకు చేరుకున్నారు. చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దేవినేని ఉమాను పరామర్శించారు. భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన సీతమ్మ, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.