పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ నియ‌మితుల‌య్యారు.

తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేశ్‌ లను సీఎం కేసీఆర్ నియమించారు. సంబంధిత అధికారిక ఉత్తర్వులు త్వ‌ర‌లోనే వెలువడనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/