ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న : సీఎం శివ‌రాజ్‌సింగ్

ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని క‌మ‌లానెహ్రూ ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం జ‌రిగి న‌లుగురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘ‌ట‌న‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ విచారం వ్య‌క్తంచేశారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న అన్నారు. ఘ‌ట‌న‌పై వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించామ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న నేర‌పూరిత నిర్ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఘ‌ట‌న నేప‌థ్యంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నుంచి తాను నివేదిక కోరాన‌ని, ఆ నివేదిక ద్వారా ఎక్క‌డ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జ‌రిగింది, ఎక్క‌డ జ‌రుగ‌లేదు అనే విష‌యం తెలుసుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఆస్ప‌త్రులు ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించాల‌న్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/