ఆర్ఆర్ఆర్ నుండి ‘నాటు’ సాంగ్ ప్రోమో వచ్చేసింది

ఆర్ఆర్ఆర్ నుండి అసలు సిసలైన నాటు సాంగ్ ప్రోమో వచ్చింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు’ అంటూ సాగే ఈ ఫుల్ సాంగ్ రేపు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిన్న నాటు ప్రోమో రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు జక్కన్న.

ఈ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ పవర్ ఫుల్ స్టెప్పులతో దుమ్ములేపినట్లు అర్థం అవుతోంది. ఎంఎం కీరవాణి ఈ పాటకు మాస్ ట్యూన్ సమకూర్చగా.. రాహుల్ సిప్లింగంజ్ – కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ గీతానికి గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా కీలక పాత్రల్లో ఆలియా భట్ – శ్రియ – సముద్రఖని- ఒలీవియా మోరీస్ నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 07 న ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. https://www.youtube.com/embed/OVY7_ki60UU