మేయర్‌ కు మళ్లీ కరోనా పరీక్షలు

హైదరాబాద్ ను వణికిస్తోన్న కరోనా

'Corona' in Hyderabad City
‘Corona’ in Hyderabad City

Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధిలోని నగర వాసులను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఇటీవల జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రావ్మెూహన్‌ కారు డైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారించిన విషయం తెలిసిందే.

తాజాగా కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. గత మూడు రోజులుగా సూపరింటెండెంట్‌ అధిక జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్‌ అని తేలడంతో అదే హాస్పిటల్‌లో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.

సూపరింటెండెంట్‌తో  ప్రైమరీ కాంటాక్ట అయినవారి కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హాస్పిటల్‌ సిబ్బంది అందరికి రంగారెడ్డి ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు నిర్వహించనుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

గురువారం మేయర్‌ డ్రైవర్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు జీహెఎంసీ సబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే మేయర్‌ బొంతు రావ్మెూహన్‌ కరోనా పరీక్షలు నిర్వహించగా..

తాజాగా మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. మేయర్‌ డైవర్‌ కు పాజిటివ్‌ రావడంతో శుక్రవారం బొంతు రావ్మెూహన్‌ శాంపిల్స్‌ తీసుకున్నారు డాక్టర్లు.

అయితే నాలుగు రోజుల క్రితమే బొంతు రావ్మెూహన్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ అని తేలింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ 100 నుంచి 175 దాకా కేసులు నవెూదవుతుండడంతో అందరిలోఆందోళన పెరుగుతోంది. తమ గల్లీలోనో, డివిజన్‌లోనో కరోనా వచ్చిందని తెలియగానే మరింత ఆందోళన చెందుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/