శ్రీ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుక‌లు

వేదోక్తంగా ఆయుష్య హోమం, ఆవహంతీ హోమం

Swaroopanandendra Swamy
Swaroopanandendra Swamy

Visakhapatnam: శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి తన గురువులు స్వరూపానందేంద్రకు అభ్యంగన స్నానం చేయించారు.

ఆ తర్వాత స్వామీజీ గో పూజ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు.

అనంతరం స్వరూపానందేంద్ర తన అనుష్ఠాన దైవం సమ్మెకు, సుబ్రమణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

స్వరూపానందేంద్ర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్య హోమం, ఆవహంతీ హోమం వేదోక్తంగా నిర్వ‌హించారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/