భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది. చిరంజీవి , తమన్నా , కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా సాంగ్స్ ఆకట్టుకోగా , ఈరోజు గురువారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ గ్యాంగ్ అమ్మాయిలని కిడ్నాప్ చేయడంతో ట్రైలర్ మొదలైంది. ఆ కిడ్నాప్ చేస్తోంది ఎవరు అనేది పోలీసులు ఎంత ప్రయత్నం చేసిన పట్టుకోలేదు. పబ్లిక్ కి ప్రాబ్లెమ్ వస్తే పోలీసుల దగ్గరకి వెళ్తారు. అదే పోలీసులకే ప్రాబ్లెమ్ వస్తే భోళా భాయ్ దగ్గరకి వస్తారు.. అనే డైలాగ్ తో మెగాస్టార్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఆ తర్వాత అమ్మాయిలని కిడ్నాప్ చేసే గ్యాంగ్ కి లీడర్ గా విలన్ ని పరిచయం చేసి.. మమ్మల్ని టచ్ చేయాలంటే ఎవడో ఒకడు కాదు నన్ను మించిన గ్యాంగ్ స్టార్, మోన్ స్టార్, డిస్ట్రాయర్ రావాలి.. అనే డైలాగ్ తర్వాత చిరంజీవి లుక్ రివీల్ చేశారు.

అక్కడి నుంచి ఓ మార్కెట్ లో లోకల్ రౌడీ రవి శంకర్ గ్యాంగ్ ని కొట్టే సీన్ ని ప్రెజెంట్ చేశారు. అక్కడ నా వెనుక మాఫియా ఉంది అని విలన్ చెబితే.. నా వెనుక దునియా ఉంది.. అనే డైలాగ్ తో చిరు అదరగొట్టాడు. తర్వాత కీర్తి సురేష్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. అక్కడి నుంచి లాయర్ క్యారెక్టర్ లో తమన్నా పాత్రని ఎంట్రీ చేయించి.. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా అనే డైలాగ్ తో మెగాస్టార్ లో కామిక్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు. తరువాత సాంగ్స్ తో సందడి వాతావరణం చూపించి వెంటనే యాక్షన్ మోడ్ లోకి ట్రైలర్ షిఫ్ట్ అయ్యింది. ఇక శ్రీముఖితో ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ విజువల్స్ అదరగోట్టాయి. ఓవరాల్ గా ట్రైలర్ మాస్ & కామెడీ తో సాగింది. ఖచ్చితంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అర్ధం అవుతుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video