రాడిస‌న్ హోట‌ల్ తో పాటు ప‌బ్‌ లిక్క‌ర్ లైసెన్సులు రద్దు చేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారుతుందని విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో శనివారం బంజారాహిల్స్ లోని ర్యాడిస‌న్ హోట‌ల్ పబ్ లో డ్రగ్స్ దొరకడం , ఉదయం మూడు గంటల వరకు పబ్ ఓపెన్ అవ్వడం పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శల పలు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ర్యాడిస‌న్ హోట‌ల్ కు సంబందించిన లైసెన్సు తో పాటు పబ్ , లిక్కర్ కు లైసెన్సులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా బంజారా హిల్స్ ప‌రిధిలో ర్యాడిస‌న్ హోట‌ల్ పై అంత‌స్తులో ఈ ప‌బ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ పబ్ యువత తో ఉగిపోతుంటుంది. ఈ పబ్ లో డ్రగ్స్ నడుస్తున్నాయనే విషయం తెలిసి పోలీస్ అధికారులు నిఘా పెట్టారు. గత మూడు వారాలుగా పబ్ లో జరుగుతున్నవన్నీ ఫై అధికారులకు తెలియజేసి..శనివారం ఒక్కసారిగా దాడి చేసారు. ఈ దాడిలో దాదాపు 150 మంది యువతీ , యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించి వారికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. పట్టుబడిన వారిలో సినీ , రాజకీయ , వ్యాపార రంగాలకు చెందినవారు ఉన్నారు. ప్రస్తుతం పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.