వైరల్ : రాధే శ్యామ్ ఓటిటిలో రిలీజ్ కాబోతుందా..?

గత మూడేళ్లుగా ప్రభాస్ అభిమానుల్లో నానుతున్న పదం రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో యూవి క్రియేషన్ , గోపికృష్ణ బ్యానర్ లలో భారీ వ్యయం తో నిర్మితమైన ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. ఎన్నో అడ్డుకులు తొలగించుకొని జనవరి 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సమయంలో ఓ వార్త అభిమానులను కలవరపాటుకు గురి చేస్తుంది. అదే రాధే శ్యామ్ ఓటిటి లో రిలీజ్ చేయబోతున్నారని.

ప్రస్తుతం కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ చేపట్టారు. మరికొన్ని రోజుల్లో పగటి పూట కూడా కర్ఫ్యూ చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కి ఈ టెన్షన్ పట్టుకుందిట. నార్త్ ఇండియాలో మూవీస్ కి జనాలు వచ్చేది అంతా నైట్ షోస్ కే. ఉదయం షోలు అక్కడ ఎపుడూ పెద్దగా ఫుల్ అవవని ట్రేడ్ అనలిస్టులు చెబుతారు. ఇక కొత్త ఏడాది కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెపుతుండడం తో రాధే శ్యామ్ యూనిట్ రిలీజ్ ఆలోచనలో పడిందట. ఇదే తరుణంలో భారీ వ్యయం తో నిర్మించిన ఈ మూవీ ఓటీటీకి వెళ్ళనుంది అంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అసలు ఓటీటీ అన్న వార్త ఎలా వచ్చిందో తెలియదు కానీ అది నిజం కాకూడదని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.