ఖమ్మం జిల్లాలో మంకీ పాక్స్ కలకలం

ఖమ్మం జిల్లాలో మంకీ పాక్స్ కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే యువకుడు ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల లో గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ..ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా..అతడికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే సదరు డాక్టర్ డిహెచ్ఓ కి సమాచారం అందించారు. డిహెచ్ఎంఓ ఆదేశాల మేరకు పేషెంట్ ను హైదరాబాదులోని ఫీవర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఇక కామారెడ్డి కి చెందిన యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించినప్పటికీ అతడికి మంకీపాక్స్‌ సోకలేదని నిర్దారణ అయ్యింది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి..ఈ నెల 6న కువైట్‌ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా రాషెస్‌ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్‌ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈరోజు ఆ రిపోర్ట్స్ వచ్చాయి. వాటిలో నెగిటివ్ రావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.