రేపటి నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

భారత్ జోడో యాత్రను విజయంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమైయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) పేరుతో రేపటి నుండి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఇంఫాల్ నుంచి బదులు తౌబల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ మైదానం నుంచి బయలుదేరుతుందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ఇంఫాల్‌లోని హప్తా కాంగ్‌జైబంగ్ మైదానం నుంచి యాత్ర ప్రారంభానికి అనుమతి కోరామని, కానీ కొన్ని షరతులో యాత్రకు రాఫ్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీనితో చివరి క్షణంలో సుమారు 34 కిమీ దూరంలోని వేదికకు మారవలసి వచ్చిందని కాంగ్రెస్ మణిపూర్ శాఖ అధ్యక్షుడు కీషమ్ మేఘచంద్ర తెలిపారు.

రేపు ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది.