తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు రైలు

అయోధ్య రామమందిర దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఓ ప్రత్యేక రైలు నడిపించనుంది. జనవరి 22న జరిగే రామలల్లా ప్రతిష్టాపన కోసం దేశం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. దీనికోసం శరవేగంగా ఏర్పాట్లు జరిపోతున్నాయి. సంక్రాంతి రోజున మొదలయ్యే ఉత్పవాలు పదిరోజుల పాటూ కొనసాగనున్నాయి. ఇక ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల వాళ్ళ కోసం రెండు రైళ్ళు అయోధ్యకు వెళ్ళనున్నాయి.

యశ్వంత్పూర్-గోరఖ్పూర్ (15024) రైలు ప్రతి శుక్రవారం ధర్మవరం (తె.2.35), అనంతపురం, కర్నూలు సిటీ, MBNR, కాచిగూడ (ఉ.10.40), కాజీపేట, సిర్పూర్ కాగజ్నగర్లో ఆగుతుంది. బల్లార్ష, నాగ్పూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సా.4.25 గంటలకు అయోధ్య చేరుకుంటుంది.

మరోపక్క అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. దేశ నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్య (Ayodhya) చేరుకునేందుకు వీలుగా మరిన్ని రైళ్ళు పెంచుతామని చెబుతోంది రైల్వేశాఖ. రామ మందిరం ప్రారంభం తర్వాత 100 రోజుల పాటూ దేశంలోని పలుచోట్ల నుంచి వెయ్యి రైళ్ళు ప్రత్యేకంగా నడుపుతామని తెలిపింది.