రేపు భారత్‌ బంద్‌, దేశవ్యాప్తంగా నిరసనలు

25 కోట్ల మంది పాల్గొంటారని కార్మిక సంఘాల అంచనా

Trade Unions Call for 'Bharat Bandh'
Trade Unions Call for ‘Bharat Bandh’

న్యూఢిల్లీ: రేపు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ను కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేకత విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ సమ్మెను తలపెట్టనున్నాయి. ఈ సమ్మెలో దాదాపుగా 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ సమ్మెకు ఐఎన్‌టియుసి, ఏఐటియుసి, సిఐటియు, టియుసిసి తదితర సంఘాలు తమ మద్దతును తెలిపాయి. కార్మికుల డిమాండ్లపై భరోసా కల్పించే విషయంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని, దీంతో 10 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా సమ్మె చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాయి. విద్యారంగంలో చోటు చేసుకున్న మార్పులను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణంయిచాయి. కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణ వ్యవస్థ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారిని వారు వెల్లడించారు. దీంతో పాటు రైల్వే ప్రైవేటీకరణ, ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కాగా ఈ సమ్మె ప్రభావం బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై తీవ్రంగా ఉండనుంది. అయితే బ్యాంకు యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/