వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ

2019 ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఘటన

vallabhaneni-vamsi-satires-on-chandrababu-and-nara-lokesh

అమరావతిః గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కోర్టు విచారణకు వల్లభనేని వంశీ హాజరు కాకపోవడంతో… గతంలోనే ఆయనకు బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.