పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న బంద్‌

Bharat Bandh
Bharat Bandh

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, బంద్‌కు పిలుపునిచ్చాయి. కేరళలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మికులు పెద్దసంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. కాగా ఆయా రాష్ట్రాల్లోని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. పుదుచ్చేరిలో ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ముంబై, చెన్నై, పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ముంబైలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. చెన్నైలోని మౌంట్ రోడ్‌లో పది యూనియన్లకు చెందిన కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో కార్మికులు సమ్మె చేపట్టారు. నిరసనలో భాగంగా ఎన్‌బీఎస్‌టీసీకి చెందిన బస్సు డ్రైవర్లు హెల్మెట్ ధరించి బస్సును నడిపారు. కాగా, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/