మే 24న ఐపిఎల్ 2020 ఫైనల్
రాత్రి 7.30 నుంచే మ్యాచ్‌లు మొదలు?

ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2020 మే 24 జరగనుంది. మార్చి 29న ముంబయిలోని వాఖండే స్టేడియంలో ప్రారంభమయి, మే 24 న ముగియనుంది. అంటే మొత్తం 57 రోజుల పాటు ఐపిఎల్ క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. టోర్నీ ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కాబట్టి.. తొలి, ఫైనల్ మ్యాచ్ ముంబైలోనే జరగనున్నాయి. ‘ఐపిఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూలు ఇంకా ఖరారు కానప్పటికీ ఫైనల్ మాత్రం మే 24న నిర్వహిస్తారు. టోర్నీ మార్చి 29న ఆరంభమవుతుంది. అంటే 45 రోజుల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో.. రోజుకు ఒకే మ్యాచ్ నిర్వహించేందుకు ఇబ్బందేమీ ఉండదు. టీఆర్పీ రేటింగ్‌తోనే అసలు సమస్య. మ్యాచ్ ఆలస్యమవ్వడమే దీనికి కారణం. అప్పుడు స్టేడియాలకు వచ్చిన వారు ఇంటికి వెళ్లడమూ ఇబ్బందిగా మారుతోంది. చర్చలు ఇంకా జరుగుతున్నప్పటికీ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ఆరంభం కావొచ్చు’ అని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/