జంక్‌ఫుడ్‌తో జాగ్రత్త..
రోజూ తీసుకునే ఆహారంలో జంక్‌ఫుడ్ కారణంగా అనారోగ్యమే

మనపై సామాజిక మాధ్యమాలు చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. అది ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తున్నదని ఒక సర్వేలో వెల్లడయింది. రోజూ తీసుకునే ఆహారంలో జంక్‌ఫుడ్ కారణంగా అనారోగ్యమే
ఫేస్బుక్ వినియోగదారులు ఆన్లైన్ స్నేహితులు తినే అనారోగ్యకరమైన స్నాక్స్, జంక్‌ఫుడ్, రకరకాల పానీయాలను అదనంగా తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఫేస్బుక్ స్నేహితుల బృందంలోని సభ్యుల ఆహారపు అలవాట్లను తెలుసుకుని వాటిని పాటిస్తున్నారు. వాటిలో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు దీర్ఘకాలంలో వ్యాధులకు కారణమయ్యే జంక్‌ఫుడ్ కూడా ఉంటోంది.
ఆన్లైన్ స్నేహితులు తినే ఆహారాన్ని తెలుసుకుని అటువంటి ఆహారానికి అలవాటు పడుతున్నారు. దీంతో ఆ అలవాటు ఒక్కోసారి అనారోగ్యానికి దారి తీస్తున్నదని పరిశోధకులు చెప్తున్నారు.
రోజూ తీసుకునే ఆహారంలో అయిదో వందు జంక్‌ఫుడ్ ఉంటున్నందున అనారోగ్యానికి గురవుతున్నారని గుర్తించారు. కొన్ని ఆహార పదార్థాల ఎంపికలో యువత సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
ఫలాలా ఐటెం మంచిదేనా అని ఆన్లైన్ స్నేహితుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో శరీర తత్వానికి తగ్గ ఆహారం తీసుకోలేకపోతున్నారని పరిశోధకులు తెలిపారు.
ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది కూడా స్నేహితుల ఎంపికగా మారిపోతున్నది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/