బెంగళూరు మెట్రో రైలు కార్యకలాపాలు పొడిగింపు

బెంగళూరు లో రాత్రి 11.30 వరకు మెట్రో రైళ్లు

బెంగళూరు: బెంగళూరు మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (బీఎంటీసీ) తన సేవలను అర్ధరాత్రి వరకు విస్తరించడంతో తాజా గా బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్‌ కూడా తన సేవలను విస్తరించింది. ఈ మేరకు నగరంలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మెట్రో చివరి రైలు నగరంలోని మొత్తం నాలుగు దిక్కుల్లోనూ గురువారం నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో రైళ్ల సంచారం రాత్రి 11.30 వరకు కొనసాగనుంది.

ఆదివారం మాత్రం మెట్రో రైలు సేవలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో రైళ్ల సంచార అవధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. రాజధాని బెంగళూరులో రాత్రిపూట కర్ఫ్యూను పూర్తిగా రద్దుచేసిన తర్వాత నగరంలో నాలుగు వైపులా సంచరిస్తున్న మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/