కారు బాంబు పేలుడు..ఏడుగురు మృతి

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ వ‌రుస‌ బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ధ‌రిల్లుతున్న‌ది. నిన్న ఉద‌యం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే.. మ‌రోసారి కాబూల్‌లో బాంబు పేలుడు క‌ల‌క‌లం రేపింది. హ‌జారా తెగ‌కు చెందిన వ్య‌క్తులే ల‌క్ష్యంగా కారులో బాంబులు పెట్టి పేల్చివేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో ఏడుగురు దుర్మ‌ర‌ణం పాలైన‌ట్లు చెప్పారు. ఘ‌ట‌న బాధ్యులు ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంద‌న్నారు.

కాగా, ఈ ఉద‌యం జ‌రిగిన పేలుడుకు కూడా బాధ్యులు ఎవ‌ర‌నేది ఇంకా తెలియ‌రాలేదు. ఈ మ‌ధ్య ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్ర‌వాదులే ఎక్కువ‌గా పేలుళ్ల‌కు పాల్ప‌డుతుండ‌టంతో ఈ పేలుడుకు కూడా వాళ్లే బాధ్యులై ఉంటార‌ని ఆఫ్ఘ‌న్ పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం చోటుచేసుకున్న‌ బాంబు పేలుడులో 7 మంది ప్రాణాలు కోల్పోగా, ఉద‌యం పేలుడులో న‌లుగురు మృతిచెందిన‌ట్లు చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/