టి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌

టి కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస నేతలు పార్టీ కి గుడ్ బై చెప్పి పక్క పార్టీలలో చేరుతుండగా..ఉన్న నేతలు సైతం షాక్ ఇస్తున్నారు. తాజాగా టీపీసీసీ కొత్త కమిటీలను అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కమిటీ కూర్పుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కు కొండా సురేఖ రాజీనామా చేయగా..కొండా సురేఖ బాటలోనే పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌ పయణించారు. తన పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటుకల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి, జూనియర్లకు ప్రధాన కమిటీల్లో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌ తన పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటుకల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇక తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కు రాజీనామా చేసిన కొండా సురేఖ.. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు నాకు అసంతృప్తిని కలిగించాయని తెలిపారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ లో నా పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్థాపం కలిగించిందని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ లో నాకంటే జూనియర్లను నామినేట్ చేశారని, నన్ను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.

“టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను వేయటం బాధ కలిగించింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో నా పేరు లేదు. పొలిటికల్ ఎఫైర్స్ నాకంటే జూనియర్లకు స్థానం ఇచ్చారు. ఇది నన్ను అవమానించటమే. అందుకే రాజీనామా చేశాను. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి మంత్రిగా గెలిచాను. అయినా నా సీనియార్టీని గుర్తించకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో వేస్తే బాగుండేది. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవని వాళ్లను కూడా పొలిటికల్ ఎఫైర్స్‌లో పెట్టారు. ఇది నా స్థాయిని తగ్గించినట్టేనని నేను భావిస్తున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యమే అన్న విషయం అందరికీ తెలుసుకు. నేను పార్టీని గౌరవిస్తాను. పార్టీ అభివృద్ధి కోసం ఒక సామాన్య కార్యకర్తగా కృషి చేస్తా.” అని కొండా సురేఖ వివరణ ఇచ్చారు.