దుర్గమ్మ భక్తులఫై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం..

ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిత్యం నోరు జారీ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. తాజాగా ఈయన దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులపై నోరు జారారు. అమ్మవారి దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు గురువారం రాత్రి దర్శనానికి వచ్చారు. భక్తులంతా క్యూలైన్‌లో ఉండగానే 9.20 గంటలకు ఆలయ తలుపులను మూసివేస్తున్నారని పోలీసులు దర్శనానికి అనుమతించలేదు. దీంతో పోలీసులతో భక్తులు వాదనకు దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అక్కడి చేరుకోవడంతో. ఆయన కారును టోల్‌గేట్‌ వద్ద భక్తులు చుట్టుముట్టారు. జరిగిన విషయాన్నీ భక్తులు ఆయనకు చెప్పుకున్నారు.

కొద్దిసేపటి వరకు కారులో కూర్చుని సమాధానం చెప్పిన మల్లాది… ఓ భక్తుడు కాస్తంత గట్టిగా ప్రశ్నించడంతో కారు దిగారు. ‘ఈరోజు కాకపోతే రేపు దర్శనం చేసుకోవచ్చు కదా’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే మాటలకు భక్తులు మండిపడ్డారు. గురువారం స్లాట్‌తో టికెట్లు కొనుగోలు చేస్తే శుక్రవారం దర్శనానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. దీనికి మల్లాది నుంచి సమాధానం రాలేదు. చివరికి తన అసహనాన్ని అక్కడున్న పోలీసు సిబ్బందిపై ప్రదర్శించారు.