బిజెపి ఎమ్మెల్యెకు ప్రియాంకా గాంధీ ఆహ్వానం

బిజెపి ఎంపి అనిల్ బలూనిని టీ తాగేందుకు ఆహ్వానించిన ప్రియాంక

Priyanka Gandhi
Priyanka Gandhi

న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ తానుంటున్న ప్ర‌భుత్వ బంగ్లాను ఖాళీ చేయ‌డానికి ముందు, ఆ ఇంట్లోకి రానున్న బిజెపి ఎమ్మెల్యెను చాయ్ తాగేందుకు రావాల‌ని ఆహ్వానించారు. భార్యతో కలిసి తేనీటి విందుకు రావాలంటూ ఎంపికి ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ.. ఆయన కార్యాలయానికి లేఖ కూడా పంపారు. అయితే, బలూని నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లేదని సమాచారం.

ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ బంగళాలోనే ఉంటున్నారు. ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో బంగళాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు నోటీసులు పంపింది. దీంతో బంగళాను ఖాళీ చేస్తున్న ప్రియాంక హరియాణలోని గురుగ్రామ్‌కు తన నివాసాన్ని మార్చనున్నారు. కాగా ఆగస్టు ఒకటో తేదీ లోపు ప్రియాంక గాంధీ తన బంగళాను ఖాళీ చేయాలన్న కేంద్రం ఆదేశాలతో ఖాళీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. ప్రియాంక ప్రస్తుతం నివసిస్తున్న బంగళాను బిజెపి రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనికి కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ టీ తాగేందుకు రావాలంటూ బలూనిని ఆహ్వానించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/