సోనూసూద్‌ను‌ ఇక విలన్ గా చూడలేను

సోనూసూద్ పై సోమిరెడ్డి ప్రశంసలు

సోనూసూద్‌ను‌ ఇక విలన్ గా చూడలేను
somireddy-sonu-sood

అమరావతి: మదనపల్లిలో కుమార్తెలు తండ్రికి పొలం పనుల్లో సాయపడటం చూసి సినీనటుడు సోనూసూద్ ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చిన సాయంపై టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘సోనూసూద్, నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను. సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం. ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు. వలస కూలీలకు సాయం, రైతుకు ట్రాక్టర్, విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడిన వలస కూలీలకు సోనూసూద్ సాయం చేసిన విషయం తెలిసిందే. దీంతో రియల్ హీరో అంటూ ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత కూడా పలువురికి సాయపడి ఆయన అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/