రూ.5 కాయిన్‌ చిన్నారి ప్రాణాలు తీసింది

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటె వారిపై ఓ కన్నేసి ఉండాలి. వారు ఏంచేస్తున్నారో..ఏ వస్తువులతో ఆడుకుంటున్నారో..ఏవైపు వెళ్తున్నారో అన్ని చూస్తుండాలి. ఏమాత్రం పట్టించుకోకపోయినా దారుణం జరిగే అవకాశం ఉంది. తాజాగా మైసూర్ లో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. రూ.5 కాయిన్‌ చిన్నారి ప్రాణాలు తీసింది.

వివరాల్లోకి వెళ్తే

మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) ఇంట్లో ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖుషీ మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కళ్లముందు ఆడుకుంటూ ఉన్న బిడ్డ..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.