పటౌడికి బిసిసిఐ నివాళి

‘సాహస బ్యాట్స్‌మెన్‌’ క్యాప్షన్‌ షేర్‌

Pataudi-File
Pataudi-File

ముంబయి: భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, దివంగత మన్సూర్‌ అలి ఖాన్‌ పటౌడి 80వ జయంతి సందర్భంగా బిసిసిఐ నివాళులు అర్పించింది.

బిసిసిఐ తన ట్విటర్‌ ఖాతాలో పటౌడి ఫొటోను ‘సాహస బ్యాట్స్‌మన్‌ అనే క్యాప్షన్‌ షేర్‌ చేసింది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సాహస వంతమైన ఆటగాడు పటౌడి అని, అతని వర్ధంతి సందర్భంగా పటౌడిని స్మరించు కుందామని బిసిసిఐ పేర్కొంది.

భారత క్రికె ట్‌కు సారధ్యం వహించిన పటౌడి 46 మ్యాచ్‌లలో ఇండియాకు ప్రాతినిథ్యం వహించి ఆరు సెంచరీలు, 16 అర్ద సెంచరీలతో 2,793 పరుగులు సాధించాడు.

తానాడిన 46 మ్యాచ్‌లలో 40 మ్యాచ్‌లకు సారధ్యం వహించి 9 మ్యాచ్‌లలో విజయం సాధించాడు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/