అర్జెంటీనాకు మహిళా హాకీ జట్టు పయనం

కరోనా టెస్టుల్లో అందరికీ నెగిటివ్‌

Women's hockey team travels to Argentina
Women’s hockey team

న్యూఢిల్లీ : ప్రపంచ నంబర్‌ టు అర్జెంటీనాతో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు రాణి రాంపాల్‌ నేతృత్వంలోని భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనా బయలుదేరి వెళ్లింది.

భారత జట్టు అక్కడ ఈనెల 26, 28, 30, 31 తేదీలలో అర్జెంటీనాతో తలపడతుంది. అంతకుముందు అర్జెంటీనా జూని యర్‌, బి జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ యేడాది టోక్యో ఒలింపిక్స్‌ జరుగనున్న నేపథ్యంలో హకీ ఇండియా ఈ పర్యటన ఏర్పాటు చేసింది. కొవిడ్‌-19 కారణంగా హాకీ జట్టు స్పోర్ట్స్‌ అథారిటీ కేంద్రాలలో శిక్షణకే పరిమితమయ్యాయి.

అర్జెంటీనాకు వెళ్లేముందు క్రీడాకారిణులు అందరికి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. ఇరు దేశాల హాకీ సంఘాలు జట్లకు బయోబబుల్‌ ఏర్పాట్లు చేశాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/