క్వార్టర్స్‌లో బోపన్న జంట

నెదర్లాండ్స్: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ రోటర్‌డ్యామ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరింది. పురుషుల డబుల్స్‌లో బోపన్నడెన్నిస్ షపొవాల్వో (కెనడా) ద్వయం 76, 67, 108తో ఆస్ట్రేలియాకు చెందిన జాన్ పీర్స్‌మైకెల్ వీన్‌సపై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ అద్భుతమైన పోరాటంతో విజేతగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో బోపన్న తన అనుభవాన్నంతా రంగరించి ప్రత్యర్థి జోడీని కంగుతినిపించాడు. క్వార్టర్స్‌లో బోపన్న జోడీ నాలుగో సీడ్ జీన్ రోజర్‌హోరియ టెకావుతో తలపడనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/