బాబాయ్ కోసం చరణ్ కొత్త న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడా..?

ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కు ఎంత ఇష్టమో తెలియంది కాదు. అందుకే ఇప్పుడు బాబాయ్ కోసం ఓ న్యూస్ ఛానల్ ను పెట్టబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాల్లో రాణించాలంటే వారికంటూ ఓ న్యూస్ ఛానల్ , న్యూస్ పేపర్ లేదా సపోర్ట్ చేసే చానెల్స్ ఉండాలి. అప్పుడే ఆ పార్టీ జనాల్లోకి బాగా వెళ్తుంది. వారు చేసే ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిపై ప్రజల్లో నమ్మకం కలగజేయడం లో న్యూస్ ఛానల్ కానీ పేపర్ కానీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి పార్టీ వారు తమకంటూ కొన్ని చానెల్స్ ను ఎంపిక చేసుకొని పెట్టుకుంటారు.

ఈ క్రమంలో బాబాయ్ పార్టీ కోసం చరణ్ ముందుకొచ్చారని అంటున్నారు. జనసేనకు ఇప్పుడున్న డిజిటల్ క్యాంపెయిన్ తో పాటుగా ఓన్ గా టీవీ ఛానల్స్ కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ మద్దతిచ్చే మీడియా..వైసీపీ కి సొంత ఛానల్ ఉన్నాయి. దీంతో..ఎన్నికలకు ఏడాదికి ముందే జనసేనకు బలమైన ప్రచారానికి ప్లాట్ ఫాం సిద్దం చేయాలని చరణ్ ప్లాన్ చేశారట. అందులో భాగంగా గతంలో తన తండ్రి చిరంజీవి-నాగార్జున భాగస్వామ్యంతో నడిపించిన విధంగానే ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా న్యూస్ ఛానల్ కొనుగోలుకు డిసైడ్ అయ్యారని సమాచారం. ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న ఆ న్యూస్ ఛానల్ ప్రస్తుత బీజేపీ నేత మద్దతుతో నడిచింది. ఇప్పుడు అదే ఛానల్ తాను టోకేవర్ చేసి వచ్చే ఏడాదికి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాం చరణ్ ఆలోచనగా చెబుతున్నారు.

రాజకీయంగా ఏపీలో జగన్ – పవన్ మధ్య పోటీ ఉంది. జగన్ ను ఎలాగైనా అధికారంలో నుంచి తప్పించాలనేది పవన్ లక్ష్యం. జగన్ కు ఉన్న మీడియా మద్దతు కీలకమని గ్రహించిన రాం చరణ్ ..తన బాబాయ్ కు ముందుగా తన ద్వారా ఆ లోటు లేకుండా చేయాలని ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే చరణ్ న్యూస్ ఛానల్ పెడుతున్నాడా..లేదా అనేది మరికొన్ని రోజుల్లో అధికారికంగా క్లారిటీ వస్తుంది.