నేటి నుండి ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలోకి డబ్బులు

Rs 500 to be deposited into women Jan Dhan bank account

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈక్రమంలోనే ప్యాకేజీ మూడో విడత డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేసే ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే మొత్తం రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేసింది. మూడో విడత డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్టు ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ డబ్బులు విడతల వారీగా జమ కానున్నాయి.

డబ్బులు జమ వివరాలు ఇలా..


అకౌంట్ నెంబర్‌ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి జూన్ 5న, అకౌంట్ నెంబర్‌ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి జూన్ 6న డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అకౌంట్ నెంబర్‌ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి జూన్ 8న, అకౌంట్ నెంబర్‌ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి జూన్ 9న, అకౌంట్ నెంబర్‌ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి జూన్ 10న డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. జూన్ 5న నగదు బదిలీ ప్రారంభమై జూన్ 10న ముగుస్తుంది. ఏటీఎంల దగ్గర రద్దీని కంట్రోల్ చేసేందుకు 5 రోజులు 5 విడతల్లో నగదు బదిలీ చేయనుంది బ్యాంకు.డబ్బులు అకౌంట్‌లో పడగానే విత్‌డ్రా చేయడానికి హడావుడిగా వెళ్లాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకు మిత్రాలు, సీఎస్పీల దగ్గర ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/