బాలకృష్ణ అల్లుడుకి బ్యాంకు నోటీసులు

Sri Bharat

Hyderabad: తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, ఆయన కుటుంబీకులకు బ్యాంకు నోటీసులు వెళ్లాయి. హైదరాబాద్, అబీడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి, టెక్నో యునీక్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గతంలో రుణాన్ని తీసుకున్న వీరు, దాన్ని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో వారిని పలుమార్లు సంప్రదించినా, ప్రయోజనం లేకపోయిందని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. దీంతో వారికి నోటీసులు పంపించామని, తదుపరి ఆస్తులను జప్తు చేసే కార్యక్రమాలను కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని ఓ అధికారి వెల్లడించారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/