అచ్చంపేట‌లో ఉద్రిక్త‌త.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం ముట్ట‌డికి వెళ్లిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు
అడ్డుకున్న టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు


అచ్చంపేట‌ : తెలంగాణలోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట‌లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. అచ్చంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత‌ గువ్వ‌ల బాల‌రాజు క్యాంపు కార్యాల‌యం ముట్ట‌డికి కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌య‌లుదేర‌గా వారిని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకున్నారు. కొంద‌రు కాంగ్రెస్‌ కార్య‌ర్త‌ల‌పై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భౌతిక దాడుల‌కు దిగారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకుని వ్యానులో తీసుకెళ్లారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను వ‌దిలేసి త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకెళ్లార‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/