‘వీరసింహారెడ్డి’ గా వస్తున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి గా రాబోతున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌నవ‌రిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారో అని గత కొద్దీ రోజులుగా అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ ఎదురు చూపులకు తెరదించారు మేకర్స్.

నందమూరి అభిమానులకు ముందే దీపావళి వచ్చేసింది. ఈ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను ఐకానిక్ ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజు వద్ద చెప్పిన టైమ్‌కి.. అంటే శుక్రవారం 8 గంటల 15 నిమిషాలకు రివీల్ చేశారు. ఇక ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాల‌కృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఫాద‌ర్‌-డాట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసంద‌D’ ఫేం శ్రీలీలా, బాల‌కృష్ణ‌కు కూతురిగా న‌టిస్తుంది.