కుమారుడి వివాహంపై వైఎస్‌ షర్మిల ట్వీట్‌

ఈ నెల 18న నిశ్చితార్థ కార్యక్రమం ఉంటుందన్న షర్మిల

YSRTP Chief YS Sharmila

హైదరాబాద్‌ః తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 17న తన కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనుందని ఆమె ప్రకటించారు. అట్లూరి ప్రియతో తన కుమారుడి పెళ్లి జరగనుందని చెప్పారు. ఈ నెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం జరగబోతోందని తెలిపారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ ను సందర్శిస్తామని తెలిపారు. తొలి వివాహ ఆహ్వాన పత్రికను నాన్న సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పూర్తి వివరాలను తెలియజేశారు. మరోవైపు రాజారెడ్డి, అట్లూరి ప్రియలు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.