సీఎం కేసీఆర్ ఫై బండ్ల గణేష్ పొగడ్తల వర్షం

సినీ నిర్మాత , నటుడు బండ్ల గణేష్ మరోసారి సీఎం కేసీఆర్ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం ఉదయం గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ఫై ప్రసంశలు కురిపించారు.

ఈ రోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడింది, ఆనందాన్నిస్తుందన్నారు. మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పది. ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కేసీఆర్‌ ను పొగిడారు. మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భు తమైన ప్రగతి పదం వైపు నడిపించే సత్తా, సామర్థ్యత మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను ఈ యాదగిరి నరసింహ స్వామి ఆలయం చూశాక..చాలా సంతోషం అనిపించింది.. ముఖ్యమంత్రి గారు మీకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతునంటూ తన అభిమానాన్ని కనపరిచారు.

https://twitter.com/ganeshbandla/status/1625335803839938560?s=20&t=vVMEIWcVL3uegV9gGEs51A