మొదటిసారి పూజా హగ్దే డబ్బింగ్ చెపుతుంది

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుపెట్టిన ఇంతకాలానికి మొదటిసారి తెలుగు లో డబ్బింగ్ చెపుతుంది పూజా హగ్దే. వరుస విజయాలతో జెట్ స్పీడ్ లో ఉన్న పూజా..ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ లో నటిస్తుంది. అక్టోబర్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ డబ్బింగ్ కార్య క్రమాలు జరుపుకుంటుంది. ఈ క్రమంలో పూజా మొదటిసారి తన వాయిస్ ను ఇస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటివరకు సరైన హిట్ కొట్టకపోయేసరికి ఈ మూవీ తో ఆ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూశారట. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని సమాచారం. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరినట్టు సమాచారం. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉందట. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం కావడం తో అందరి ఆశలు ఈ మూవీ ఫైనే ఉంది. ఈ మూవీ ని జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు.